: స్క్రిప్టు కంటే దర్శకుడే ముఖ్యం: బాలీవుడ్ విలన్ సిద్ధిఖీ


బాలీవుడ్ లో విలక్షణమైన నటనతో విలన్ పాత్రధారిగా పేరుతెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖీ స్క్రిప్టు కంటే దర్శకుడే ముఖ్యమని చెబుతున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమాలో పాకిస్థాన్ రిపోర్టర్ గా నటించాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ముంబైలో మాట్లాడుతూ, చాలా మంది స్క్రిప్టు బాగుండాలని అంటుంటారని, తనకు మాత్రం స్క్రిప్టు కంటే ముందు దర్శకుడు నచ్చాలని, దర్శకుడు నచ్చితే పాత్రను అతనే మలుస్తాడని నవాజుద్దీన్ సిద్ధిఖీ చెప్పాడు. కాగా, 'కిక్' సినిమాలో విలన్ గా సిద్ధిఖీ బాలీవుడ్ అభిమానులను అలరించాడు.

  • Loading...

More Telugu News