: మధ్యప్రదేశ్ గవర్నర్ కు పదవీగండం?... రాష్ట్రపతితో భేటీకానున్న కేంద్ర హోంమంత్రి
వ్యాపం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కు పదవీ గండం తప్పేలా లేదు. సుప్రీంకోర్టు కూడా రామ్ నరేష్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో, అతని ఊస్టింగ్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వ్యాపం కేసుకు సంబంధించిన డెవలప్ మెంట్స్ ను రాష్ట్రపతికి వివరించనున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్రమోదీ తన ఎనిమిది రోజుల విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రామ్ నరేష్ పై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం.