: హల్దీరామ్స్ ఉత్పత్తుల్లో కూడా హానికారకాలు ఉన్నాయా?
మన దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగిన హల్దీరామ్స్ ఉత్పత్తుల్లో కూడా హానికారకాలు ఉన్నాయా? ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికే... హల్దీరామ్స్ అందిస్తున్న స్వీట్లు, స్కాక్స్ లను తనిఖీ చేయాలంటూ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) అధికారులను మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పెస్టిసైడ్స్, సాల్మొనెల్లా బ్యాక్టీరియాలు మోతాదుకు మించి ఉన్నాయంటూ హల్దీరామ్స్ ఉత్పత్తులను ఇప్పటికే అమెరికాలో నిషేధించారు. ఈ నేపథ్యంలో, మన దేశంలో కూడా ఈ ఉత్పత్తులను పరీక్షించనున్నారు.