: మా ఇంటికి రండి: మమత, మాయావతి, ములాయంలకు సోనియా గాంధీ ఆహ్వానం


విపక్షాలన్నీ ఏకతాటిపై నడుస్తున్నాయన్న సంకేతాలను ప్రజల్లోకి పంపేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇఫ్తార్ పార్టీని వాడుకోనున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలందరినీ ఆమె విందుకు పిలిచారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ హెడ్ మాయావతి, సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులకు ఆమె ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. వీరితో పాటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలకూ ఆహ్వానాలు వెళ్లినట్టు సమాచారం. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఏ అంశాలు చర్చకు తేవాలన్న విషయమై వీరిమధ్య చర్చ జరుగుతుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News