: ఎయిర్ ఆసియాలో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత పైలట్లు... ఆస్ట్రేలియా సంచలన నివేదిక


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ప్రేరేపిత ఇండోనేషియా పైలట్లు విధుల్లో ఉన్నట్టు 'ఆపరేషనల్ ఇంటెలిజన్స్ రిపోర్ట్' పేరిట ఆస్ట్రేలియా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వీరు ఇండోనేషియాకు చెందిన వారని, ఎయిర్ ఆసియాతోపాటు ప్రీమీ ఎయిర్ విమానయాన కంపెనీలో పనిచేస్తున్నారని అనుమానిస్తున్నట్టు తెలిపింది. వీరు ప్రమాదకారకులు కావచ్చని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో వారిని గుర్తించేందుకు విమానయాన సంస్థల సహకారాన్ని ఫెడరల్ పోలీసులు కోరారు. ఇది నిఘా, భద్రతలకు సంబంధించిన అంశాలు కాబట్టి ఏ విధమైన ఇతర వివరాలు అందించలేమని పోలీసు వర్గాలు వివరించాయి. కాగా, ఎయిర్ ఆసియా సంస్థ ఇండియాలో లోకాస్ట్ ఎయిర్ లైన్స్ గా పేరు తెచ్చుకుని పలు నగరాల మధ్య విమానయాన సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News