: నర్రవాడలో నాలుగు మృతదేహాలు... నెల్లూరు జిల్లాలో కలకలం


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. జిల్లాల్లోని దత్తలూరు మండలం నర్రవాడ సమీపంలోని బైపాస్ రోడ్డు పక్కగా ఓ గుంతలో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు పురుషుల మృతదేహాలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెనువెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఆ నలుగురు వ్యక్తులు మూడు రోజుల కిందటే చనిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఘటన వెనుక గల కారణాలను వెలికితీసే పనిలో పోలీసులు పడ్డారు.

  • Loading...

More Telugu News