: పదిహేనేళ్లకే పీజీ పరీక్ష... సత్తా చాటిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి


'పిట్ట కొంచెం కూత ఘనం' అనే మాట అక్షరాల ఈ అమ్మాయికి సరిపోతోంది. సాధారణంగా 15 సంవత్సరాలకు అందరూ పదవ తరగతి చదువుతుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఏకంగా పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతోంది. తాజాగా సెమిస్టర్ పరీక్షలు కూడా రాసేసింది. ఇంతకీ ఎవరా ప్రజ్ఞాశాలి అనుకుంటున్నారు కదా? ఆమే టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అయిన నైనా జైస్వాల్! రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ సమీపంలోని విజయ్ కరణ్ పీజీ కళాశాలలో జైస్వాల్ పీజీ పొలిటికల్ సైన్స్ మొదటి ఏడాది సెమిస్టర్ పరీక్ష రాసింది. గతంలో కూడా నైనా ఎనిమిది సంవత్సరాలకు పదో తరగతి, పదేళ్లకు ఇంటర్, 13వ సంవత్సరంలో డిగ్రీ పూర్తిచేసి అబ్బురపరిచింది. తరువాత ఉస్మానియా యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్ పీజీలో చేరింది. మరోవైపు టేబుల్ టెన్నిస్ లో పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతకాలను సాధించి నైనా నైపుణ్యాన్ని చాటుకుంటోంది.

  • Loading...

More Telugu News