: కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత... ఖమ్మం, వరంగల్ జిల్లాల పర్యటన వాయిదా
ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, వరంగల్ జిల్లాల పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడింది. సీఎం స్వల్ప అస్వస్థతకు లోనైన కారణంగానే అధికారులు పర్యటనను వాయిదా వేసినట్టు తెలిసింది. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ జిల్లాల్లో ఆరుసార్లు పర్యటన వాయిదాపడింది. ఈ జిల్లాల్లో నేడు హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం తో బాటు, లకారం చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.