: సండ్ర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా


ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. వచ్చే సోమవారానికి విచారణ వాయిదా వేస్తున్నట్టు ఏసీబీ కోర్టు తెలిపింది. బెయిల్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు సమయం కోరిన నేపథ్యంలోనే విచారణ వాయిదాపడింది. ఓటుకు నోటు కేసులో ప్రస్తుతం సండ్రను ఏసీబీ కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఆయనను విచారిస్తున్నారు. రేపటితో సండ్ర కస్టడీ ముగియనుంది.

  • Loading...

More Telugu News