: ఓటుకు నోటు కేసులో జనార్దన్ ఎవరు? నోటీసులు ఎవరికివ్వాలి?... తలపట్టుకుంటున్న టీ-ఏసీబీ


తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా జనార్దన్ అనే కొత్త పేరు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈయన ఎవరన్న విషయాన్ని మాత్రం ఏసీబీ ఇంకా తెలుసుకోలేకపోయింది. ఈ వ్యవహారంలో 'బాస్'కు మధ్యవర్తిగా జనార్దన్ వ్యవహరించాడని ఏసీబీ అనుమానిస్తోంది. కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్యల మధ్య జరిగిన సంభాషణల్లో పలుమార్లు జనార్దన్ పేరు ప్రస్తావనకు రాగా, అసలీ జనార్దన్ ఎవరన్న విషయాన్ని టీఎస్-ఏసీబీ ఇంకా తేల్చలేకపోయింది. కేసులో జనార్దన్ ను విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్న అధికారులు ఎవరికి నోటీసులు ఇవ్వాలన్న విషయంలో తలపట్టుకుంటున్నారు. చాలా ఫోన్ కాల్స్ లో జనార్దన్ కు చెప్పారా? అని సెబాస్టియన్ అడిగాడన్న విషయాన్ని కాల్ రికార్డుల ద్వారా ఏసీబీ గుర్తించింది. దీంతో డీల్ లో ఆయన పాత్ర పెద్దదేనని ఏసీబీ అంచనాకు వచ్చింది. నేడు సండ్రను ప్రశ్నించే సమయంలో జనార్దన్ ఎవరన్న విషయాన్ని ఏసీబీ కనిపెట్టవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News