: ‘నారాయణ’ బస్సులో సీటు కోసం కొట్టుకున్న విద్యార్థులు...ఓ విద్యార్థి కంటికి గాయం


కార్పొరేట్ స్కూల్ ‘నారాయణ’ బస్సులో విద్యార్థులు కొట్టుకున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కిన విద్యార్థుల మధ్య సీటు కోసం వాదులాట జరిగింది. ఈ వాదులాట కాస్తా దెబ్బలాటగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు బస్సులోనే పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ విద్యార్థి కంటికి తీవ్ర గాయమైంది. రక్తం కంటబడగానే కంగారుపడ్డ విద్యార్థులు స్కూల్ యాజమాన్యానికి గొడవపై సమాచారం చేరవేశారు. తక్షణమే స్పందించిన యాజమాన్యం బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో నేటి ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News