: మరో వారం పాటు మండుతుందట!
తెలుగు రాష్ట్రాలపై మరోసారి భానుడు ఉగ్రరూపం చూపనున్నాడు. మరికొన్ని రోజులపాటు సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు కురవకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇదిలావుండగా, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ లపై అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని అంచనా వేశారు.