: తుపాకీ మిస్ ఫైర్... విశాఖలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
సర్వీస్ తుపాకీని శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు దూసుకువచ్చిన తూటా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ను పొట్టనబెట్టుకుంది. విశాఖపట్నంలోని జీకే వీధి పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. తన తుపాకీ శుభ్రం చేస్తున్న అజయ్ కుమార్, అదే తుపాకీ మిస్ ఫైర్ కారణంగా మృతి చెందాడు. అయితే అజయ్ కుమార్ సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అతడి సహచరులు అనుమానిస్తున్నారు.