: సండ్ర నోరు విప్పేనా?... మరికాసేపట్లో ఏసీబీ కస్టడీకీ టీడీపీ ఎమ్మెల్యే


ఓటుకు నోటు కేసులో అరెస్టైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో చర్లపల్లి జైల్లో ఉన్న సండ్రను ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. నాలుగు రోజుల క్రితం నాటి విచారణలో సండ్ర ఏమాత్రం నోరు విప్పలేదని ఏసీబీ అధికారులు కోర్టుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక కేసులో సండ్ర ప్రత్యక్ష ప్రమేయంపై ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. కోర్టు అనుమతి సాధించిన ఏసీబీ పోలీసులు మరికాసేపట్లో చర్లపల్లి జైలు నుంచి సండ్రను బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. అయితే ఈ దఫా విచారణలోనైనా సండ్ర నోరు విప్పుతారా? అన్న అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

  • Loading...

More Telugu News