: పవన్ పార్లమెంటుకు రావాలనుకుంటే ఆయన కోసం రాజీనామా చేస్తా: అనకాపల్లి ఎంపీ


టాలీవుడ్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలు తీవ్రంగా స్పందించడం తెలిసిందే. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు కూడా పవన్ విషయమై మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ కల్మషం లేని వ్యక్తి అని పేర్కొన్నారు. సమాచార లోపంతోనే పవన్ కల్యాణ్ విమర్శలు చేశారని, ఆయనకు కొందరు తప్పుడు సమాచారం అందించారని ఆరోపించారు. ఢిల్లీలో తాము ఏం చేస్తున్నామో తెలుసుకోవాలనుకుంటే ఆయన పార్లమెంటుకు వచ్చి చూడొచ్చని సలహా ఇచ్చారు. పవన్ పార్లమెంటుకు రావాలని కోరుకుంటే ఆయన కోసం తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు. తాము కూడా పవన్ కల్యాణ్ కు అభిమానులమేనని తెలిపారు. పవన్ ఇచ్చిన సలహాలను రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకుంటామని శ్రీనివాసరావు అన్నారు.

  • Loading...

More Telugu News