: వారెన్ బఫెట్, బిల్ గేట్స్ సరసన నిలిచిన అజీమ్ ప్రేమ్ జీ


ప్రపంచ కుబేరులు, పారిశ్రామిక దిగ్గజాలు వారన్ బఫెట్, బిల్ గేట్స్ సరసన ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ చేరారు. వందల కోట్ల రూపాయలు, అంతులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దిగ్గజ పారిశ్రామిక వేత్తలు సంపదను తృణప్రాయంగా త్యజిస్తున్నారు. భారీ ఎత్తున వితరణ కార్యక్రమాలు చేపట్టి జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు సంపదలో కొంత భాగాన్ని ఛారిటీకి అప్పగిస్తున్నారు. ఈ జాబితాలో ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ కూడా చేరారు. విప్రోలో 39 శాతం షేర్లను కలిగి ఉన్న అజీమ్ ప్రేమ్ జీ, 18 శాతం షేర్లను వితరణకు వెచ్చిస్తానని ప్రకటించారు. దీంతో, ఛారిటీకి అత్యధిక మొత్తం వెచ్చిస్తున్న తొలి భారతీయుడుగా ప్రేమ్ జీ నిలిచారు. 18 శాతం షేర్లు అంటే వందల కోట్ల రూపాయలని నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News