: కృష్ణాజిల్లాలో 'బాహుబలి' చిత్రాన్ని విడుదలకు ముందే ప్రదర్శిస్తారట!
టాలీవుడ్ టాప్ డైరక్టర్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు 'బాహుబలి' ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారాహి సంస్థ అధినేత కొర్రపాటి సాయి కృష్ణాజిల్లాలో ఈ సినిమాను కాస్త ముందుగానే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. వచ్చిన సొమ్మును నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. గురువారం అర్ధరాత్రి నుంచి కృష్ణాజిల్లాలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. జిల్లాలో 30 థియేటర్లలో 'బాహుబలి' ముందస్తు ప్రదర్శన ఉంటుంది. అందుకోసం, సాయి జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. అన్నట్టు... సాయి గతంలోనూ వారాహి సంస్థ తరపున హుదూద్ బాధితులకు 100 టన్నుల బియ్యాన్ని అందించి పెద్ద మనసు చాటుకున్నారు.