: పాప్ సింగర్ గొప్ప మనసు...అభిమానికి 50 వేల డాలర్ల సాయం
పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గొప్ప మనసు చాటుకుంది. చిన్నారి అభిమానానికి చలించిపోయిన టేలర్ స్విఫ్ట్, తన అభిమానికి కేన్సర్ అని తెలుసుకుని ఆవేదనతో వైద్య సేవల్లో సహాయంగా ఉండేందుకు 50 వేల డాలర్లను పంపించింది. నవోమీ ఓక్స్ అనే 11 ఏళ్ల చిన్నారి టేలర్ స్విఫ్ట్ కు వీరాభిమాని. ఆగస్టు 18న టేలర్ స్విఫ్ట్ లైవ్ కాన్సర్ట్ కు హాజరయ్యేందుకు స్నేహితులతో ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలో చిన్నారికి కేన్సర్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో చిన్నారిని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చికిత్స ప్రారంభించారు. అయితే చిన్నారి కోరిక తీర్చాలని భావించిన తల్లిదండ్రులు, చిన్నారి కోరిక, సోకిన వ్యాధి, చికిత్స వివరాలు, ప్రస్తుత పరిస్థితి, టేలర్ స్విఫ్ట్ పై పెంచుకున్న అభిమానం వంటి విషయాలన్నీ తెలియజేస్తూ ఓ వీడియోను రూపొందించి, దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఆ నోటా ఈ నోటా పాకి టేలర్ స్విఫ్ట్ కు చేరింది. ఆ వీడియోను చూసిన టేలర్ స్విఫ్ట్ చిన్నారికి 50 వేల డాలర్లను పంపించింది.