: దేశ రాజధానిలో ఒక రోజు చెత్త 257 విమానాల బరువుకు సమానం
దేశ రాజధానిని చెత్త సమస్య తీవ్రంగా వేధిస్తోంది. వేతనాలు చెల్లించడం లేదంటూ మున్సిపల్ కార్మికులు మూకుమ్మడిగా సమ్మెకు దిగడంతో ఢిల్లీ మహానగరంలో చెత్త పేరుకుపోయింది. ఢిల్లీలో ఒకరోజు పోగయ్యే చెత్త 257 బోయింగ్ విమానాల బరువు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంటే 9 వేల మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. అలాగే ఈ చెత్తను బయట పారబోస్తే 70 ఎకరాల (13 మిలియన్ చదరపు అడుగులు) భూమిని ఆక్రమిస్తుంది. ఆ ప్రదేశంలో 2500 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించవచ్చని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.