: తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ సినిమా 'బాహుబలి': అల్లు అర్జున్
'బాహుబలి' విడుదల దగ్గర పడుతున్నకొద్దీ తెలుగు సినీ ప్రముఖులు ఆ సినిమాపై అంతులేని అభిమానం కురిపిస్తున్నారు. టాలీవుడ్ యువ నటుడు అల్లు అర్జున్ 'బాహుబలి'పై ట్వీట్లు చేస్తూ ఆసక్తి రేపుతున్నాడు. గత వారం రోజులుగా అల్లు అర్జున్ ఏదో ఒక సందర్భంలో 'బాహుబలి'పై ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ సినిమా 'బాహుబలి' అంటూ ట్వీట్ చేశాడు. ఇంత గొప్ప సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలకు శుభాకాంక్షలు తెలిపాడు. తెలుగు సినీ పరిశ్రమ గర్వించే సినిమా తీసిన రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రభాస్, రానాలు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించాడు.