: మరో చిక్కులో వసుంధర రాజే... లలిత్ మోదీని పద్మ అవార్డుకు సిఫార్సు చేశారంటూ కథనం!
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ దెబ్బకు ఇప్పటికే పలువురు ప్రముఖులు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, 2007 జులై 28న లలిత్ మోదీని పద్మ అవార్డుల కోసం రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సిఫార్సు చేశారని ఓ ప్రముఖ హిందీ దినపత్రిక ప్రచురించింది. రాజస్థాన్ క్రికెట్ అభివృద్ధికి లలిత్ మోదీ ఎంతో పాటుపడ్డారన్న కోణంలో, ఆయన పేరును రాజే సిఫార్సు చేసినట్టు పేర్కొంది. ఇప్పటికే, లలిత్ మోదీ వ్యవహారంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేకు ఈ కథనం మరింత తల నొప్పిని తీసుకొచ్చింది.