: 'మన్నత్' గోడలపై అభిమాని రాతలు... దిగ్భ్రాంతికి గురైన షారుఖ్


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇటీవలే విదేశాల్లో షూటింగ్ ముగించుకుని వచ్చారు. ముంబయిలో అడుగుపెట్టిన ఆయన నేరుగా తన నివాసం 'మన్నత్' చేరుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కలల సౌధం గోడలపై ఎవరో అభిమాని పిచ్చి రాతలు రాయడమే షాక్ కు కారణం. 'లవ్యూ ఎస్సార్కే' అని, 'ఎస్సార్కే సీ యూ ఆన్ 15' అని ఇంటి ముందు గోడపై ఎవరో గుర్తు తెలియని అభిమాని రాశాడు. ఇది బాద్షాకు రుచించినట్టు లేదు. దానిపై వెంటనే ట్విట్టర్లో స్పందించారు. ఒక్కరోజు ఇంట్లో లేకపోతే ఇలాగే చేస్తారంటూ ట్వీట్ చేశారు. మొత్తమ్మీద దిగ్భ్రాంతికి గురైనట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News