: 'వ్యాపం' స్కాంలో కొత్త మలుపు... సీబీఐ విచారణకు ఆదేశించలేమన్న హైకోర్టు
వ్యాపం (వ్యవసాయిక్ పరీక్షా మండల్) స్కాంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆదేశించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 20 వరకు విచారణ చేపట్టబోమని స్పష్టం చేసింది. మరోవైపు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ, పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.