: సుప్రీంకోర్టులో దావూద్ పై దాఖలైన పిటిషన్ తిరస్కరణ


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. దావూద్ ను భారత్ కు తీసుకొచ్చే విషయంలో జోక్యం చేసుకోవాలంటూ మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే కిషోర్ సమ్రితే దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న దావూద్ ను భారత్ కు తీసుకురావడంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు. దీనిపై స్పందిస్తూ, ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది.

  • Loading...

More Telugu News