: లీటరుకు 84 కి.మీ. మైలేజీని ఇచ్చే బజాజ్ కొత్త బైక్


ఇండియాలో అత్యధిక ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్న రెండో అతిపెద్ద సంస్థ బజాజ్ ఆటో మరో రెండు కొత్త బైకులను బుధవారం నాడు విడుదల చేసింది. 'బజాజ్ డిస్కవర్ 125', 'బజాజ్ డిస్కవర్ 125 ఎం' పేరిట వీటిని పూణెలో సంస్థ ఆవిష్కరించింది. ఫస్ట్ జనరేషన్ డిస్కవర్ బైకును పోలినట్టు ఉండే దీని ధర రూ. 53,096 (ఎక్స్ షోరూం, పూణె) అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు బైకుల మధ్య ధర వ్యత్యాసం రూ. 3 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ బైక్ లీటరుకు 84.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని వివరించారు. 124.6 సీసీ డీటీఎస్-ఐ ఇంజన్, 11 పీఎస్ పవర్, ఎలక్ట్రిక్ స్టార్ట్ తో లభించే బైక్ గరిష్ఠంగా 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని తెలియజేశారు.

  • Loading...

More Telugu News