: కొనుగోళ్లు లేక వెలవెల... మూడు నెలల కనిష్ఠానికి బంగారం ధర, రూ. 1,500కు పైగా తగ్గిన వెండి ధర


భారత బులియన్ మార్కెట్లో బంగారం ధర మూడు నెలల కనిష్ఠానికి పడిపోయింది. శుభకార్యాలు లేక కొనుగోళ్లు వెలవెల బోవడంతో ఆభరణాల తయారీదారులు నూతన కొనుగోళ్లకు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే, రూ.330 తగ్గి రూ.26,170కి చేరింది. ఇదే సమయంలో కిలో వెండి ధర ఏకంగా 1,550 తగ్గి రూ.34,450కి చేరింది. చైనా మార్కెట్ పతనం, దాని ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోవడం, గ్రీస్ భయాలు ఇన్వెస్టర్లను బులియన్ మార్కెట్ కు దూరంగా ఉంచాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News