: రియాలిటీ షోలలో పాల్గొనే వయసు, సమయం, అనుభవం లేవు!: అలియా భట్
రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించేంత టైమ్, అనుభవం తనకు లేవని బాలీవుడ్ యువ నటి అలియా భట్ తెలిపింది. ముంబైలో ఓ డాన్స్ షోకు కరణ్ జోహర్ తో అతిథిగా వెళ్లిన అలియా భట్ ను, 'మీరెందుకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించకూడదు?' అని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆమె సమాధానమిస్తూ, తనకు అంత వయసు లేదని స్పష్టం చేసింది. రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వెళ్లేంత తీరిక లేదంది. తనకు సినిమా అవకాశాలు లేకపోతే, అప్పుడు కావాల్సినంత సమయం చిక్కుతుందని, అప్పుడు వెళ్తానని చెప్పింది. తనకు సంగీత ప్రధానమైన రియాలిటీ షోలంటే ఇష్టమని తెలిపింది. అంటే, భవిష్యత్ లో అలియాని ఇండియన్ ఐడల్, సరిగమప వంటి సింగింగ్ రియాలిటీ షోల న్యాయనిర్ణేతగా చూసే అవకాశం ఉందన్నమాట. కాగా అలియా భట్ మంచి సింగర్ కూడా, 'హైవే' సినిమాలో పాట పాడి శభాష్ అనిపించుకుంది.