: గట్టెక్కించాలంటూ అమెరికా, జర్మనీ నేతలకు సిప్రాస్ ఫోన్లు


సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటూ గ్రీస్ ప్రధాని సిప్రాస్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ కు ఫోన్ చేశారు. యూరోపియన్ యూనియన్ నుంచి తీసుకున్న అప్పులతో గ్రీస్ నిండా మునిగిపోవడంతో వ్యయ నియంత్రణ చర్యలను యూరో జోన్ సూచించింది. వాటికి గ్రీస్ ప్రజలు అంగీకరించకపోవడంతో యూరోపియన్ యూనియన్ చర్యలకు ఉపక్రమించింది. అయితే యూరో జోన్ నుంచి గ్రీస్ ను బయటికి పంపాలా? లేక పూర్తిగా కుదేలైపోయిన గ్రీస్ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలా? అనే దానిపై గ్రీస్ తో యూరోజోన్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. గ్రీస్, యూరో జోన్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో సిప్రాస్... ఒబామా, మోర్కెల్ ను సంప్రదించారు. తన ఆలోచనలు, భవిష్యత్ లో గ్రీస్ లో చేపట్టనున్న వ్యయ నియంత్రణ చర్యలను వారికి వివరించారు. దీంతో గ్రీస్, యూరోజోన్ నేతలు సర్దుకుపోవాలని, వివాదం పెంచుకోవద్దని ఒబామా సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News