: ఏపీ ఉద్యోగుల పీఆర్సీ అమలుకు తొలగిన అడ్డంకులు


ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అమలుకు అడ్డంకులు తొలగిపోయాయి. పాత పద్ధతిలోనే పీఆర్సీని అమలుచేసేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన సీఎంఎస్ విధానాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పాత పద్ధతి హెచ్.ఆర్.ఎం.ఎస్ విధానంలోనే పీఆర్సీని అమలు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News