: త్వరలోనే తండ్రి కాబోతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్
ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా అభిమానులు, స్నేహితులతో పంచుకున్నాడు. బిడ్డను చూడాలని తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు. మూడేళ్ల క్రితం కైలీతో క్లార్క్ కు వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్లార్క్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.