: కుప్పకూలిన పెన్షనర్ ఫొటోను చూసి ఆస్ట్రేలియా నుంచి గ్రీస్ కు మిలియనీర్ పయనం!


గ్రీస్ లో నెలకొన్న ఆర్థిక కష్టాల ప్రభావంతో పెన్షన్ తీసుకోలేక, జీవనోపాధి కష్టమైపోయిందన్న బాధతో ఓ పెన్షనర్ కుప్పకూలిన ఫొటో అన్ని దినపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో చూసే వుంటారు. ఆ వ్యక్తి తన తండ్రి స్నేహితుడేనని గుర్తుపట్టిన ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ చీఫ్ వెంటనే స్పందించి ఆ పెన్షనర్ ను ఆదుకునేందుకు కదిలాడు. వివరాల్లోకి వెళితే, జియోర్గాస్ చట్జిఫోటియాడిస్ అనే 77 ఏళ్ల పెన్షనర్ గతవారంలో ఓ బ్యాంకు ముందు తనకు రావాల్సిన 120 యూరోలను ఇవ్వడం లేదని విలపిస్తూ, కుప్పకూలాడు. గ్రీస్ లో ప్రజలు అనుభవిస్తున్న కష్టాల తీవ్రత ఈ ఫొటోతో ప్రపంచానికి తెలిసింది. రెండు రోజుల తరువాత ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఫైనాన్స్ సంస్థ చీఫ్ జేమ్స్ కౌఫోస్ ఈ ఫొటోని చూశాడు. తన తండ్రికి జియోర్గాస్ స్నేహితుడని గుర్తించాడు. గ్రీస్ లో ఉన్న తన తల్లితో మాట్లాడి తక్షణం అతనికి ధన సహాయం చేయాలని సూచించాడు. ఆయనెక్కడున్నాడో తక్షణం తనకు తెలియజేయాలని ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టాడు. ఆయనకు సాయంగా ఉండే నిమిత్తం ఓ ట్రస్టును ప్రారంభించాడు. అతని ఆచూకీ తెలుసుకున్నాడు. ఈ శనివారం సిడ్నీ నుంచి తన తండ్రి స్నేహితుడిని కలుసుకునేందుకు ఏథెన్స్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అతను, అతని భార్య భవిష్యత్తులో మరే దిగులూ లేకుండా జీవించేందుకు ఏర్పాట్లు చేయాలన్నది తన ఉద్దేశమని జేమ్స్ అంటున్నారు.

  • Loading...

More Telugu News