: చైనాను అనుసరించిన ఇండియన్ మార్కెట్లు... లక్షన్నర కోట్లు ఆవిరి!


చైనా స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న మార్కెట్ పతనం భారత ఇన్వెస్టర్ల నడ్డి విరిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ఇండియాపై చూపే ప్రభావం అతి స్వల్పమేనని చెబుతూ వస్తున్న నేతలు, నిపుణుల మాటలు వట్టివేనని తేలిపోయాయి. చైనా మార్కెట్ పతనలోయలోకి దూకేయడంతో, దాని వెనకే సెన్సెక్స్, నిఫ్టీలు కూడా పడిపోయాయి. మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి సెన్సెక్స్ 505 పాయింట్లు పడిపోయి 27,666 పాయింట్ల వద్దకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 1.8 శాతం తక్కువ. ఇదే సమయంలో నిఫ్టీ సూచి 155 పాయింట్లు పడిపోయి 1.83 శాతం నష్టంతో 8,355 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్టర్ల సంపద గంగలో కలిసింది. కాగా, నేటి చైనా మార్కెట్లో 'బ్లడ్ బాత్' కనిపించింది. షాంగై కాంపోజిట్ 6.28 శాతం నష్టంతో 3,506 పాయింట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే హాంగ్ సెంగ్ 1,740 పాయింట్లు పడిపోయి 7.49 శాతం నష్టంతో 23,235 పాయింట్లకు చేరింది. జపాన్ నిక్కీ-225 సూచిక 3.24 శాతం, తైవాన్ సూచిక 3.05 శాతం నష్టపోయాయి.

  • Loading...

More Telugu News