: భూమా నాగిరెడ్డికి బెయిల్
వైకాపా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఇటీవల కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో, భూమా నాగిరెడ్డికి, ఎన్నికల విధుల్లో ఉన్న డీఎస్పీ దేవదానంకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎన్నికల విధులకు భూమా ఆటంకం కలిగించారని, తాకవద్దంటూ తన ఆత్మగౌరవం దెబ్బతినేలా అవమానించారంటూ దేవదానం కేసు పెట్టారు. ఈ క్రమంలో, భూమాపై ఐపీసీ సెక్షన్ 353, 188, 506లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, 14 రోజుల రిమాండ్ లో ఉన్న భూమాకు ఈరోజు బెయిల్ మంజూరయింది. ప్రస్తుతం ఆయన కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.