: విడుదలకు ముందే ‘హౌస్ ఫుల్’ బోర్డులు...సంచలనాలు సృష్టిస్తున్న ‘బాహుబలి’
టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’ విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది. ఈ నెల 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రదర్శనకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం ప్రారంభమైంది. హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద కిలో మీటర్ల మేర అడ్వాన్స్ బుకింగ్ క్యూ లైన్లు పెరిగిపోయాయి. ఆయా థియేటర్లలో పదుల సంఖ్యలో షోలకు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుబోయాయట. ‘బాహుబలి’ టికెట్ల కోసం ఆడా మగా అన్న తేడా లేకుండా ఎగబడుతున్నారు. దీంతో ఈ చిత్ర ప్రదర్శనకు ఎంపికైన థియేటర్లలో ‘హౌస్ ఫుల్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.