: ఇంజినీరింగ్ కళాశాలలపై సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టులో పిటిషన్
తెలంగాణలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును జేఎన్ టీయూహెచ్ ధర్మాసనంలో సవాల్ చేసింది. 25 కళాశాలలను కౌన్సెలింగ్ కు అనుమతించాలన్న కోర్టు ఆదేశంపై పిటిషన్ దాఖలు చేసింది. ఈ మధ్యాహ్నం లంచ్ మోషన్ లో పిటిషన్ విచారణకు రానుంది. మరోవైపు తెలంగాణలో నేటి నుంచి జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. ఒకట్రెండు రోజుల్లో మళ్లీ జేఎన్ టీయూహెచ్ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి తెలిపారు.