: ‘ట్యాపింగ్’పై పక్కా ఆధారాలున్నాయి... టీడీపీ యువనేత నారా లోకేశ్ వ్యాఖ్య


ఓటుకు నోటు కేసు నేపథ్యంలో వెలుగుచూసిన ఫోన్ ట్యాపింగ్ వివాదానికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని టీడీపీ ప్రకటించింది. ఈ మేరకు నిన్న ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ విస్పష్ట ప్రకటన చేశారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉత్తర తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘టీడీపీ నేతల ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారులు సజ్జన్నార్, శివధర్ రెడ్డి స్వయంగా సంతకం చేసి సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చిన రెండు కాపీలు కూడా ఉన్నాయి. ఆ ఆధారాలను సరైన సమయంలో బయటపెడతాం’’ అని అన్నారు.

  • Loading...

More Telugu News