: పవన్ పై విమర్శలు గుప్పించడంతో, అసంతృప్తికి గురైన ఏపీ హోంమంత్రి... టీడీపీలో ఇబ్బందికర వాతావరణం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీలు నిన్న విమర్శల వర్షం కురిపించడంతో ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. గత ఎన్నికలలో టీడీపీ విజయం సాధించడంలో పవన్ చేసిన కృషి వెలకట్టలేనిదని... పవన్ జోలికి వెళితే, తాను కూడా ఎంత వరకైనా వెళతానని టీడీపీ ముఖ్య నేతలతో చినరాజప్ప అన్నట్టు సమాచారం. పవన్ పై విమర్శలు గుప్పిస్తే... కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తుందని అన్నారు. చినరాజప్ప కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే అన్న సంగతి తెలిసిందే. పవన్ పై టీడీపీ ఎంపీలు చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ, ఏపీ హోంమంత్రి వ్యాఖ్యలు సొంత పార్టీలోనే ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయని చెబుతున్నారు.