: పవన్ కల్యాణ్ ను బాగా వాడుకుని వదిలేశారు: చంద్రబాబుపై అంబటి ఆరోపణ


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుకున్నంత సేపు వాడుకుని, ఇప్పుడు వదిలేశారని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ పై టీడీపీ ఎంపీలు విమర్శలు గుప్పించడం సామాన్యమైన విషయం కాదని... ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగిందని చెప్పారు. చంద్రబాబు ఆమోదముద్ర లేకుండా టీడీపీ ఎంపీలు ఏమీ చేయరని స్పష్టం చేశారు. ఎవర్నైనా వాడుకుని, వదిలేయడం చంద్రబాబు నైజమని అంబటి ఫైర్ అయ్యారు. పవన్ ను విమర్శించడానికి కొందరిని పురమాయించి... మరోవైపు, పవన్ కు మద్దతుగా మాట్లాడే పనిని మరికొందరికి అప్పగించారని... ఇదంతా చంద్రబాబు ఆడుతున్న డబుల్ గేమ్ అని చెప్పారు.

  • Loading...

More Telugu News