: మరో ఐదుగురికి నోటీసులు ఖాయం... చంద్రబాబుకు కూడా ఇచ్చే అవకాశం: జీవన్ రెడ్డి


ఓటుకు నోటు కేసులో మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వడం ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయని... కొత్త పేర్లు కూడా బయటకు వచ్చాయని ఆయన చెప్పారు. జనార్దన్ అనే వ్యక్తితో సండ్ర చాలా సార్లు మాట్లాడారని... జనార్దన్ చంద్రబాబుకు సన్నిహితుడని తెలిపారు. జిమ్మి అనే మరో వ్యక్తి నారా లోకేష్ తో చాల్ క్లోజ్ గా ఉంటారని చెప్పారు. కేసు విచారణ చాలా సీరియస్ గా కొనసాగుతోందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసులో చంద్రబాబుకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. వ్యక్తిగతంగా లాయర్ కూడా అయిన తాను ఈ విషయంలో తన అభిప్రాయాన్ని చెబుతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News