: సనత్ నగర్ నుంచి పోటీ చేసే యోచనలో పవన్ కల్యాణ్?


జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని యోచిస్తున్నారా? హైదరాబాదులోని సనత్ నగర్ శాసనసభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారా? అవుననే అంటోంది ఓ ఆంగ్ల పత్రిక. సదరు పత్రిక కథనం ప్రకారం... 2014 ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్ వ్యక్తిగత సర్వే చేయించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే సనత్ నగర్ స్థానం, ఎంపీగా పోటీ చేయాలనుకుంటే మల్కాజిగిరి స్థానం అయితే సేఫ్ అని సర్వేలో తేలిందట. ఈ నేపథ్యంలో, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (టీడీపీ ఎమ్మెల్యే) రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే... ఆ స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ యోచిస్తున్నారు. అయితే సదరు పత్రిక కథనం ఎంతమేర వాస్తవ రూపం దాలుస్తుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.

  • Loading...

More Telugu News