: సండ్రకు బెయిలా?... ఏసీబీ కస్టడీనా?: రెండు పిటీషన్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ


ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీడీపీ నేత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు బెయిల్ లభిస్తుందా? లేక ఆయన ఏసీబీ కస్టడీకి వెళతారా? అన్న ఉత్కంఠ నెలకొంది. కేసులో సండ్ర కీలక నిందితుడని చెప్పిన ఏసీబీ అధికారుల వాదనతో ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వెనువెంటనే తనకు బెయిల్ మంజూరు చేయాలని సండ్ర కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు విచారణలో భాగంగా సండ్ర ఏమాత్రం నోరు విప్పలేదని చెప్పిన ఏసీబీ అధికారులు, ఆయనను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు ఆయా పిటీషన్లలో ప్రతివాదులుగా ఉన్న సండ్ర, ఏసీబీలకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు పిటీషన్లపై నేడు కోర్టులో విచారణ జరగనుంది.

  • Loading...

More Telugu News