: మెవెదర్ టైటిల్ ను వెనక్కు తీసేసుకున్న ప్రపంచ బాక్సింగ్ సంస్థ
రెండు నెలల క్రితం జరిగిన హై ఓల్టేజ్ బాక్సింగ్ ఫైట్ లో మూనీ పకియావ్ ను మట్టి కరిపించి వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ గా అవతరించిన ఫ్లాయిడ్ మెవెదర్ కు ప్రపంచ బాక్సింగ్ సంస్థ (డబ్ల్యూబీఓ) గట్టి షాకే ఇచ్చింది. నిర్ణీత గడువులోగా చెల్లించాల్సిన రూ.1.27 కోట్ల శాంక్షన్ ఫీజును ఎగ్గొట్టినందుకు అతడి టైటిల్ ను వెనక్కు తీసేసుకుంది. ఇప్పటికే వెల్టర్ వెయిట్ టైటిల్ ను కలిగి ఉన్న మెవెదర్, హై ఓల్టేజ్ మ్యాచ్ తో మిడిల్ వెయిట్ టైటిల్ ను కూడా చేజిక్కించుకున్నాడు. దీనిపై స్పందించిన డబ్ల్యూబీఓ, రెండింటిలో ఏది కావాలో మెవెదర్ తేల్చుకోవాలని కూడా సూచించింది. రెండు టైటిళ్లను ఒకే సమయంలో కలిగి ఉండటం కుదరదని కూడా డబ్ల్యూబీఓ తేల్చిచెప్పింది.