: రాష్ట్రపతి దక్షిణాది విడిది ముగిసింది... నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దక్షిణాది విడిది నేటితో ముగుస్తోంది. ప్రస్తుతం హైదరాబాదు పరిధిలోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస చేసిన ప్రణబ్ నేడు హకీంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. గత నెల 29న హైదరాబాదు చేరుకున్న రాష్ట్రపతి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఏపీలోని తిరుపతి వెళ్లిన రాష్ట్రపతి ప్రణబ్, తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణలోని యాదగిరిగుట్ట వెళ్లిన ప్రణబ్, లక్ష్మీనరసింహస్వామి సేవలో తరించారు. ఇక రాష్ట్రపతి నిలయంలో బస చేసిన ప్రణబ్ ను రెండు రాష్ట్రాలకు చెందిన అన్ని పార్టీల ప్రతినిధులు కలిశారు. పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇక దక్షిణాది విడిదిని ముగించుకుని ఢిల్లీ వెళుతున్న రాష్ట్రపతికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ వీడ్కోలు పలకనున్నారు.