: రండి...పర్యటించండి...దాని గురించి మాత్రం మాట్లాడొద్దు: ఒబామాకు కెన్యా నేతల హెచ్చరికలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కెన్యా నేతలు హెచ్చరించారు. ఈ నెలాఖరున అమెరికా అధ్యక్షుడు కెన్యా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటనలో 'గే' హక్కుల గురించి స్పందించవద్దని ఒబామాకు కెన్యా ఉపాధ్యక్షుడు, స్పీకర్ స్పష్టం చేశారు. కెన్యాలో 'గే' వివాహాల మాటెత్తితే 14 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. అదీ కాక 'గే' అంటే అక్కడి సమాజం ఈసడించుకుంటుంది. దీంతో వారు ఒబామాకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఒబామా వారి హెచ్చరికలను పట్టించుకుంటారా? అనే సందేహం వారిని పట్టి పీడిస్తోంది. ఎందుకంటే గతంలో దక్షిణా ఆఫ్రికా, టాంజానియా, సెనెగల్ దేశాల్లో ఒబామా పర్యటన సందర్భంగా 'గే' హక్కుల గురించి గళమెత్తారు.