: కిమ్ కార్దాషియన్ రికార్డును అధిగమించిన సోదరి


కిమ్ కార్దాషియన్ రికార్డును ఆమె సోదరి కెండాల్ జెన్నర్ అధిగమించింది. అమెరికాకు చెందిన కిమ్ కర్దాషియన్ కు రియాల్టీ టీవీ స్టార్ గా, శృంగార తారగా అంతులేని గుర్తింపు ఉంది. ఆమె సోదరి కెండాల్ జెన్నర్ అమెరికాలో సూపర్ మోడల్ గా రాణిస్తోంది. కిమ్ కర్దాషియన్ సోషల్ మీడియా ఇన్ స్టా గ్రాంలో ఓ ఫోటో పోస్టు చేయగా సుమారు 24 లక్షల మంది అభిమానులు లైక్ చేశారు. తాజాగా కెండాల్ జెన్నర్ ఓ ఫోటోను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. ఈ ఫోటో పెట్టిన కొద్ది సేపట్లోనే 26 లక్షల మంది అభిమానం చూరగొంది. దీంతో అతి తక్కువ వ్యవధిలో పాప్యులర్ అయిన ఫోటోగా ఇది వినుతికెక్కింది. మొత్తానికి కిమ్ రికార్డును సోదరే అధిగమించింది.

  • Loading...

More Telugu News