: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోం: వైకాపా
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వైకాపా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని... దివంగత రాజశేఖరరెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వైయస్ జయంతి వేడుకలను జులై 8న ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఈ మధ్యనే జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వైకాపా మద్దతు పలికిన విషయం తెలిసిందే.