: 'వ్యాపం స్కాం'పై సీబీఐ విచారణ జరిపించాలంటూ మధ్యప్రదేశ్ సీఎం విన్నపం
కోట్ల రూపాయల వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర హైకోర్టును కోరారు. ఈ మేరకు ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టుకు లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న పలువురు వరుసగా చనిపోతుండటంతో సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ ఇప్పటికే కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాంతో స్పందించిన చౌహాన్ సీబీఐ విచారణకు మొగ్గుచూపుతున్నారు.