: షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ ల సంగీత్


బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, ఢిల్లీ అమ్మాయి మీరా రాజ్ పుత్ ల సంగీత్ వేడుక ధూమ్ ధామ్ గా జరిగింది. ఎరుపు రంగు కుర్తా, నలుపు చుడీదార్ లో షాహిద్ మెరిసిపోగా, అతనికి కాబోయే భార్య మీరా గోల్డెన్ బోర్డర్ తో ఉన్న పసుపురంగు లెహంగాలో తళుక్కుమంది. సంగీత్ వేదికపై వారిద్దరూ కలసి డాన్స్ చేస్తున్న ఫోటోను షాహిద్ స్నేహితుడు, ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గత రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్లో గ్రాండ్ గా జరిగిన సంగీత్ కు షాహిద్ తండ్రి పంకజ్ కపూర్, సుప్రియా పాఠక్ (షాహిద్ సవతి తల్లి), షాహిద్ తల్లి నీలిమా అజిమ్, తమ్ముళ్లు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. ఢిల్లీలో మీరా కుటుంబానికి చెందిన ఛాతర్ పూర్ ఫాంహౌస్ లో ఈ సాయంత్రం ఏడు గంటల తరువాత షాహిద్, మీరాల వివాహం జరగనుంది.

  • Loading...

More Telugu News