: కేసీఆర్ కు చెందిన 'నమస్తే తెలంగాణ'లో చంద్రబాబు సంస్థ యాడ్... ముమ్మాటికీ మ్యాచ్ ఫిక్సింగే: షబ్బీర్


తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ భలే పాయింట్ లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని ఆరోపించిన ఆయన... దీనికి సంబంధించి ఒక ఉదాహరణను కూడా చూపారు. కేసీఆర్ కుటుంబ పత్రిక అయిన 'నమస్తే తెలంగాణ'లో చంద్రబాబుకు చెందిన 'హెరిటేజ్' సంస్థ యాడ్ వచ్చిందని... మరే ఇతర పత్రికలో కూడా ఇంతవరకు హెరిటేజ్ సంస్థ యాడ్ ఇవ్వలేదని చెప్పారు. దీన్ని బట్టే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న సంబంధాలు అర్థమవుతున్నాయని అన్నారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇద్దరు సీఎంలు ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News