: కార్డు ఇన్ సర్ట్ చేస్తే షాకిచ్చిన ఏటీఎం!


కరెంటుతో పనిచేసే పలు గృహోపకరణాలు, ఆఖరికి సెల్ ఫోన్లు షాకిచ్చిన ఘటనలు మనకెన్నో తెలుసు. తాజాగా ఏటీఎంలు షాక్ కొడుతుండటంతో ప్రజలు విస్తుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. యూపీలోని జంగాయి ప్రాంతంలో ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించిన బ్రిజేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆయన బ్యాంకు అధికారులకు, పోలీసులకూ సమాచారం ఇచ్చారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, బ్రిజేష్ వర్షంలో పూర్తిగా తడిసి ఏటీఎంకు వచ్చినందున షాక్ కొట్టి వుండవచ్చని తేల్చారు. దీంతో పాటు ఏటీఎం ఉన్న భవనం పురాతనమైనదని, మెషిన్ వైరింగ్ లోపాలు కూడా ఉండవచ్చని తెలిపారు. బ్యాంకు సిబ్బంది ఏటీఎం వైరింగును పరిశీలిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఏటీఎం షాక్ కొట్టిన వార్త బయటకు పొక్కడంతో ఆ ఏటీఎంను వాడేందుకు ప్రజలు జంకుతున్నారు.

  • Loading...

More Telugu News